తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ముక్కంటీశ్వరుడిని ఏపీ ఎండోమెంట్ జడ్జి హరినాథ్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు దక్షిణ గోపురం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.