75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను సాధించి పెట్టిన స్వాతంత్య్ర సమరయోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ... నేడు మన ముందు ఆవిష్కృతం అయిన ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములకు ధన్యవాదాలు తెలుపుదాం అని టీడీపీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
అనూహ్య విజయాలతో అద్భుతంగా సాగిన గతాన్ని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్ ప్రయాణాన్ని సుసంపన్నం చేసుకుందాం.దేశ రక్షణలో ఉన్న జవాన్లకు,అన్నం పెట్టే రైతన్నకు వందనాలు తెలుపుదాం.సహజ వనరులతో,బలమైన యువతతో నిండి ఉన్న మన దేశాన్ని,ప్రపంచంలో అగ్రదేశంగా మలచుకునేందుకు మన వంతు పాత్ర పోషిద్దా. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుందాం. జైహింద్. అని తెలియజేసారు.