యోగి వేమన విశ్వవిద్యాలయం లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్లే ఫీల్డ్ లో ఉపకులపతి ఆచార్య మునగల సూర్య కళావతి , కులసచివులు ఆచార్య దుర్భాక విజయరాఘవప్రసాద్, ప్రధానాచార్యులు కె. కృష్ణా రెడ్డి, వ్యాయమ విద్య సంచాలకులు డా. రామసుబ్బారెడ్డి తో కలసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. తదనంతరం క్రీడాశాఖ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలుత అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఉపకులపతి ఆచార్య సూర్యకళావతి స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఇస్తూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, లాల్ బహుదూర్ శాస్త్రి, భగత్ సింగ్, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు మాతృభూమికి స్వేచ్ఛా వాయువులు అందించడంలో చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. మనమందరం ఆ మహోన్నతమైన ఆత్మలకు ఎంతో రుణపడి ఉండాలన్నారు.