ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలోని శ్రీకాకుళం త్రిపుల్ ఐటీ లో సోమవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి బొడ్డేపల్లి రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటి డైరెక్టర్ జగదీశ్వరరావు మాట్లాడుతూ. ఆధునిక భారతదేశన్ని తయారు చేసేందుకువిద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలని, తద్వారా నైపుణ్య భారత్ ను తయారు చేయవచ్చని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.