జెండా పండుగ ప్రతి గ్రామంలో అంగరంగ వైభవంగా చేయాలని జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలోనూ జెండా పండుగ అంగరంగ వైభవంగా చేయాలన్నారు. స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులను గుర్తించుకోవాలన్నారు. వారి అడిగి జాడల్లో నడవాలన్నారు. మంచి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. పేదరికం లేనిసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామ స్వరాజ్యం అభివృద్ధికి బాటలు వెయ్యాలన్నారు. ప్రతి పల్లి పట్నంగా మారి ఉన్నత ఉద్యోగాలు ఉన్నత చదువులు ప్రతి ఒక్కరు సాధించేవరకు నిద్ర పోరాదన్నారు. ప్రతి ఒక్కరికి చదువు చాలా అవసరం అన్నారు. అనవసరమైన విషయాలు జోలికి పోకుండా గ్రామ అభివృద్ధికి మంచితనానికి మారుపేరుగా నిలవాలన్నారు. దేశ స్వాతంత్ర మహనీయులకు వారి మాటలను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు.