స్వాతంత్ర్య సమరయోధుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ, మంచి నడవడికతో మెలగాలని శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు మరియు సిబ్బందితో కలసి పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సిఐ సింహాద్రి నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన చిన్నారులు వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా సిఐ సింహాద్రి నాయుడు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ భారతదేశంపై గౌరవాన్ని, విధేయతను చూపుతూ, సన్మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.