మహీంద్రా వాహనాలకు మార్కెట్ రంగంలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించింది. ఎక్స్ యూవీ, బీఈ (బోర్న్ ఎలక్ట్రిక్) బ్రాండ్ల కింద ఈ మోడళ్లను ప్రదర్శించింది. ఎక్స్ యూవీ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లో ఉండగా, బీఏ కొత్త బ్రాండ్. ఎక్స్ యూవీ.ఈ8, ఎక్స్ యూవీ.ఈ9, బీఈ.05, బీఈ.07, బీఈ.09 మోడళ్లను మహీంద్రా ఇవాళ ఆటోమొబైల్ రంగానికి పరిచయం చేసింది. వీటిలో పలు మోడళ్లను 2024 నుంచి 2026 మధ్యన మార్కెట్లోకి తీసుకురానుంది. 2027 నాటికి 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని మహీంద్రా భావిస్తోంది.