పెదకూరపాడు నియోజకవర్గంలోని బెల్లంకొండ మండలంలోని కందిపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనుట్లు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరావు తెలిపారు. కందిపాడు గ్రామంలో సాయంత్రం నాలుగు గంటల నుండి 9 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వెంకటేశ్వరావు కోరారు.