రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ లింగాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం సర్పంచ్ రాజగోపాల్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి స్వయంగా మధ్యాహ్న భోజనం తిని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సర్పంచ్ తెలియచేశారు. సర్పంచుతో పాటు కేశవ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.