బీహార్ మాజీ మంత్రి సుభాష్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు బీహార్ ఉప ముఖ్యమంత్రి తర్కిషోర్ ప్రసాద్ ట్వీట్లో ట్విట్టర్ ద్వారా నివాళ్లర్పించారు. ఆయన మరణం బీహార్ రాజకీయాలకు, బీజేపీకి తీరని లోటు అని వెల్లడించారు.