దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 416.1 పాయింట్లు లాభపడి 59,879.68 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 113.15 పాయింట్లు లాభపడి 17,811.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, హీరో, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందాల్కో, అపోలో, టాటా స్టీల్, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.