పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ముల్తాన్ లో బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 20 మంది సజీవ దహనమయ్యారు. ప్రయాణికులతో లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న బస్సు హైవేపై ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.