ఏపీ ప్రభుత్వం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేసింది. మొత్తం 21 మంది సభ్యులతో పదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో దీనిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ ధార్మిక పరిషత్ దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ప్రభుత్వ పరంగా తీసుకొనే విధాన నిర్ణయాల్లో అత్యంత కీలకంగా వ్యవహిరించనుంది.