తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు వద్ద విధించిన మొదటి ప్రమాద హెచ్చరికను నీటిపారుదల శాఖాధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజ్ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది. 10,500 క్యూసెక్కుల నీటిని డెల్టా కాల్వలకు , 12.80 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.