కూలీ పనులు చేసుకునేందుకు వెళ్లిన తన కుమారుడు ప్రమాద బారిన పడి తీవ్ర గాయాలు పాలయ్యాడనే సమాచారం అందుకున్న తండ్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన సాలూరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక అల్లువీధికి చెందిన పూడిగోపి తన కుటుంబంతో కలసి జీవనం సాగిస్తున్నారు. పూడి గోపి పట్టణంలో స్థానిక శివాజీ జంక్షన్లో గల గోడౌన్ లో పనిచేస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా గోడౌన్ గోడకూలి పూడి గోపితో పాటుగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలయ్యారు. తన కుమారుడు పూడి గోపి కు తీవ్ర గాయాలయ్యాయనే సమాచారం తెలుసుకున్న తండ్రి పూడి అప్పలనాయుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు అప్పలనాయుడును సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అప్పలనాయుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడు అప్పలనాయుడు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.