అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్యను సస్పెన్స్ చేస్తున్నట్లు ఫిఫా మంగళవారం ప్రకటించింది. ఫిఫా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో బుధవారం విచారణ నిర్వహిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం తెలిపింది. కాగా, 85 ఏళ్ల చరిత్ర కలిగిన ఫిఫా భారత ఫుట్ బాల్ సమాఖ్యపై నిషేధాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa