మున్సిపాలిటీలో 15శాతానికి మించి ఆస్తిపన్ను పెంచమని చెప్పిన ప్రభుత్వం 200శాతం వరకు పెంచి ప్రజలపై భారం వేసిందని, భారీగా పెంచిన ఆస్తిపన్నును ప్రజలు వ్యతిరేకించాలని బొబ్బిలి సీపీఎం పట్టణ కార్యదర్శి పి. శంకరరావు కోరారు. సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపాలిటీలలో 15శాతానికి మించి ఆస్తిపన్ను పెంచమని చెప్పిన ప్రభుత్వం 200శాతం వరకు పెంచడం అన్యాయమన్నారు.
ఆస్తిపన్నులో స్ట్రీట్ లైట్, డ్రైనేజీ పన్నులు వసూలు చేస్తున్న కాలువలు శుభ్రం చేయడం లేదని, పాడైపోయిన స్ట్రీట్ లైట్లు వేయడం లేదన్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం పన్నులు పెంచడం దుర్మార్గమన్నారు. 15శాతానికి మించి ఆస్తిపన్ను పెరిగితే కట్టకుండా పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా సీపీఎం ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పారు. ఆయనతో సీపీఎం నాయకులు బి. శ్రీనివాసరావు, పి. అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.