ఎచ్చెర్ల మండలం కుప్పిలి గెడ్డ ఆక్రమణలతో కుచించుకుపోయింది. సుమారు 100 అడుగుల వెడల్పుగా ఉండే ఈ గెడ్డ ప్రస్తుతం 10 నుంచి 30 అడుగులకే పరిమితం అయింది. కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల పరిధిలో రొయ్యలు చెరువులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కుప్పిలి గెడ్డను అనుకొని ఏర్పాటు చేసిన రొయ్యలు చెరువుల యజమానులు. ఈ గెడ్డను కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ ఉన్నారు. దీంతో ఈ గెడ్డ కుచించుకుపోతుంది. భారీ వర్షాల సమయంలో ఈ గెడ్డలో నీరు ప్రవహించే అవకాశం లేకపోవడంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు రెవెన్యూ యంత్రంగం దీని గురించి పట్టించుకోవడం లేదు. దీనిపై అనేక ఫిర్యాదులు అధికారులకు అందినప్పటికీ. నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఆక్రమణలను తోగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.