గత రెండు రోజులుగా వంశధార నది ప్రవాహం ఎక్కువ కావడంతో రెండవ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. అయితే మంగళవారం ఉదయం నదీ ప్రవాహం ఉధృతి తక్కువ ముఖం పట్టింది. ఈ మేరకు నదిలో 71 వేల క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం విడిచి పెడుతున్నారు. అయితే ఇది ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. జలుమూరు, నరసన్నపేట, పోలాకి మండలంలో మాత్రం అధికారులు లోతు ప్రాంతవాసులకు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.