అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం మంప లో ఒక చెరువు మద్య సూర్య నమస్కారం చేసికుంటూ లొంగిపోయిన అల్లూరిని చట్టం ప్రకారం అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టాల్సి ఉండగా ఆ విధంగానే మంప లో లొంగిపోయిన అల్లూరిని కృష్ణదేవీపేట కు తీసుకురమ్మని రూథర్ ఫోర్డ్ ఆదేశాలు జారీ అయ్యాయి. అల్లూరిని మంచానికి కట్టేసి కృష్ణదేవిపేట తీసుకు వస్తుండగా. కొయ్యురు వద్ద మేజర్ గుడాల్ అడ్డుకుని. రాజేంద్రపాలెం తీసుకువెళ్లి. చింతచెట్టుకు కట్టేసి. అతిక్రూరంగా అతి దగ్గరనుండి అల్లూరి గుండెల్లో తుపాకీ గుండు దిగేలా కాల్చి చంపేశారు. అక్కడితోఆగకుండా తరువాత సుమారు రెండు నెలల పాటూ అల్లూరి తో పాటూ తన సహచరులు గా పాల్గొన్న సుమారు 400 మంది ని బ్రిటీష్ సైన్యం ఊచకోత కోశారు.