గంగూలీ త్వరలోనే ఐసీసీ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై గంగూలీ స్పందించాడు. అవన్నీ ఊహాగానాలేనని, ఎవరికి నచ్చింది వాళ్లు రాసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐసీసీ చీఫ్ పదవి అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదని, అయినా ఆ రేసులో తాను లేనని సమాధానమిచ్చాడు. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే కొనసాగుతుండగా ఈ ఏడాది నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa