అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజబెత్ అలెగ్జాండర్ మంగళవారం తెలిపారు. జలుబు, జ్వరం వంటి లక్షణాలతో కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు అధికారులు కరోనా పరీక్షలు చేయగా, ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి.