భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమంగా నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ఈ రాత్రికి నీటిమట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.