మహారాష్ట్రలోని పూణే జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్-పూణే హైవేపై రంజన్ గావ్ ఎంఐడీసీ సమీపంలో రాంగ్ సైడ్ నుంచి వస్తున్న కంటైనర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa