గనులు, భూగర్భ నిఘా విభాగం అధికారులు మంగళవారం ఎడ్లపాడు మండలంలో తనిఖీలు చేశారు. సంగం గోపాలపురం పరిధిలో మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో ఉన్న ఐదు టిప్పర్లను పోలీస్ స్టేషనను తరలించారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యలపై కేసులు నమోదు చేసి జరిమానా విధించనున్నట్లు జిల్లా గనులు, భూగర్భ నిఘా విభాగం ఏడీ కొండారెడ్డి తెలిపారు.