తెనాలి: కట్నం కోసం వేధించడంతో పాటు భార్యపై భౌతిక దాడికి పాల్పడిన భర్తపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం పట్టణ చినరావూరుకు చెందినషన్నను ఆమె భర్త సైదా ఇటీవలి కాలంలో అదనపు కట్నం కోసం మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.