తెనాలి పట్టణంలోని పద్మశాలి పేటకు చెందిన 19 సంవత్సరాల ఓ యువతి బాపట్ల కళాశాలలో డిప్లొమా చదువుతుంది. ఆమె కొన్ని సబ్జెక్టులు మిగిలి ఉన్నాయి. సోమవారం తన ధ్రువపత్రాలతో ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఇప్పటివరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.