తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీకి రెండురోజుల్లో రూ. 3.98 కోట్ల ఆదాయం సమకూరింది. వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం తిరుపతి జిల్లా ఆదాయం రూ. 2.04 కోట్లు రాగా, ఇందులో ఘాట్ రోడ్డు ఆదాయం రూ. 1.04 కోట్లు వచ్చింది. 1503 ట్రిప్పులతో 1, 14, 941 మంది భక్తులకు సేవలందించారు. సోమవారం జిల్లా ఆదాయం రూ. 1.94 కోట్లు రాగా, ఇందులో ఘాట్ రోడ్డు ఆదాయం రూ. 0.94 కోట్లు సమకూరింది.