సైబర్ నేరాల విషయంలో గ్రామీణ ప్రాంత వాసులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండల ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. మహిళా పోలీసులతో మంగళవారం పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరాలు కట్టడికి కృషి చేయాలని చెప్పారు. వ్యతిరేక కార్యకలాపాలపై 100 , 9440900708 కు సంప్రదించాలని చెప్పారు.