హత్యాయత్నం కేసులో 11 మందికి 6 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు అదనపు సెషన్స్ జడ్జి జయలక్ష్మి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే చీమకుర్తి మండలం దేవరపాలెంలో వంజా సుబ్బారావు రేషన్ దుకాణం నిర్వహించేవాడు. అదే గ్రామానికి చెందిన మేళం వెంకటేశ్వర్లు రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుబ్బారావు అనుచరులు 11 మంది కలిసి వెంకటేశ్వర్ల పై 2015లో హత్యాయత్నం చేసి గాయపరిచారు.