ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోండిలా

Life style |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 01:24 PM

సరైన వ్యాయామం, ఆహార నియమాలు పాటించకపోవడంతో అధిక రక్తపోటు తీవ్రరూపం దాల్చుతోంది. కేవలం మందులతోనే కాకుండా మంచి ఆహారపు అలవాట్లతో అధిక రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు.
- ఉప్పును వయసుకు తగినట్టు తినాలి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 5 గ్రాముల ఉప్పు తీసుకోవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు, వృద్దులు తక్కువ ఉప్పు వాడాలి.
- దుంప కూరలు తినడం తగ్గించాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వుగా మారుతుంటాయి.
- కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా తినాలి. మేక, కోడి కూరల్లో ఉండే కొవ్వు నేరుగా గుండె రక్త కణాల్లో పట్టేస్తుంది. నరాల పరిమాణం తగ్గిస్తుంది. దీంతో రక్తపోటు వస్తుంది.
- రోజుకు 20-30 గ్రాముల నూనె, నెయ్యి, వెన్న మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా తింటే శరీరంలో కొవ్వు పేరుకొని పోతుంది.
- గానుగ పట్టిన నూనెలను తెచ్చుకొని వాడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com