నిమ్మగడ్డి ఆకుల నుంచి లభించే సుగంధ తైలాన్ని పరిమళాల పరిశ్రమల్లో, కృత్రిమ విటమిన్ ఏ తయారీలో ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి ఆకులను సువాసన కోసం హెర్బల్ తేనీటి పానీయాలలో, వంటల్లో వాడుతారు. ఇది ఉష్ణ మండలంలో పెరుగుతుంది. తేమతో కూడిన వేడి, సూర్యరశ్మి ఉన్న ప్రదేశాల్లో పెరుగుతుంది. వర్షపాతం వార్షికంగా 200-250 సెం.మీ. ఉండాలి. ఎత్తైన కొండ ప్రాంతాల్లో, ఏడాది పొడవునా వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సాగు చేయోచ్చు.