దక్షిణ కాశీగా పేరొందిన శైవ క్షేత్రం శ్రీకాళహస్తికి వేల సంఖ్యలో భక్తులు తడ, శ్రీకాళహస్తి గుండా ప్రయాణిస్తారని అందుకు ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి త్వరితగతిన విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కేంద్రానికి జులై నెలలో లేఖ వ్రాశారు. స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి బుధవారం తడ, శ్రీకాళహస్తి రహదారిని జాతీయ రహదారిగా గుర్తింపు దిశగా చర్యలకు ఆదేశించారు.