అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. త్రీటౌన్ సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం. రాజమండ్రికి చెందిన ముప్పిడి ప్రవీణ్ కుమార్ (33) బెంగళూర్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగు నెలల నుండి మధురవాడ ఉన్న తన కజిన్ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. రాఖీ పండగ సందర్భంగా తన అక్క తో రాఖీ కట్టించుకునేందుకు ఈ నెల 11వ తేదీన విజయవాడ వెళ్ళాడు.
మరల తిరిగి ఈ నెల 15వ తేదీన విజయవాడలో బయలుదేరి 16 ఉదయం విశాఖ కాంప్లెక్స్ కు చేరుకున్నాడు. మధురవాడ వెళ్ళేందుకు షేర్ ఆటో ఎక్కాడు. స్వర్ణభారతి స్టేడియం దగ్గరకు వచ్చేసరికి కారు ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రవీణ్ కు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మిగిలిన ప్రయాణికులు, ఆటో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు డ్రైవర్ మువ్వల సంతోషను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.