తూర్పు గోదావరి జిల్లా (ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా) నల్లజర్ల గ్రామ శివారు వద్ద ఉన్న ప్రియాంక కన్వెన్షన్ హాల్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు ఝామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి తిరగబడింది. గుంటూరు నుండి వైజాగ్ కు 39 మంది ప్రయాణికుల తో వెళుతున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు నల్లజర్ల సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి జాతీయ రహదారి పై బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రాథమిక చికిత్స కోసం కొంతమంది ప్రయాణికులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. మరికొంత మంది ప్రయాణికులను వేరే వాహనాల్లో తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.