పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. సైకో కిల్లర్ రాంబాబును అరెస్టు చేసినట్లు నగర సీపీ శ్రీకాంత్ తెలిపారు. వారం రోజుల్లో మూడు హత్యలు చేసిన రాంబాబు అనకాపల్లి జిల్లా కోటవురట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. 2018లో రాంబాబు భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయాడని వివరించారు. రాంబాబుకు కూతురు (26) కొడుకు (27) ఉన్నారని. ఇద్దరూ తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదని తెలిపారు. అంతేకాక రియల్ ఎస్టేట్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్న సమయంలో యాజమాని చేతిలో మోసపోయాడని తెలిపారు. అప్పటినుంచి మహిళల మీద కక్ష పెంచుకున్నాడని వెల్లడించారు.
మహిళలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుని హత్యలకు పాల్పడ్డాడని ఆగస్టు 6న వాచ్మెన్ దంపతులను మొదటగా హత్య చేశాడని తెలిపారు. హత్య అనంతరం చనిపోయిన వాళ్లలో మహిళ ఉన్నారా లేదా అని తెలుసుకునేందుకు ప్రైవేటు పార్ట్స్‌ను చూసేవాడని పేర్కొన్నారు. తరువాత వాటిపై కాలితో తన్నెేవాడని. వారం తరువాత ఆగస్టు 14న తేదీన మరో మహిళను హత్య చేశాడని సీపీ వెల్లడించారు. మొత్తం మూడు హత్యలతో పాటు జులై 8న మరొకరిపై హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. హత్యలన్నింటికి ఇనుప రాడ్‌ను వినియోగించాడని. రాడ్డుతో తలపై మోది చంపేవాడని వివరించారు.
వాచ్మెన్లు అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుందని వాళ్లను ఎంచుకున్నాడని పేర్కొన్నారు. కొద్ది నెలలు నుంచి రాంబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, తను అద్దెకు ఉన్న ఇంట్లో క్షుద్ర పూజలు చేసేవాడని చెప్పారు. రాంబాబుకు కూతురు (26) కొడుకు (27) ఉన్నారని. ఇద్దరూ తండ్రిని దగ్గరకు రానిచ్చేవారు కాదని అన్నారు. గతంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో పని చేసినట్లు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు