చైనాలోని యూయాంగ్ సిటీలో విస్మయకర ఘటన జరిగింది. ఓ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని, ఆమె సహచర ఉద్యోగి వెనుక నుంచి గట్టిగా కౌగలించుకున్నాడు. ఆమె నొప్పితో విలవిలలాడినా వదల్లేదు. అతడి వల్ల ఆమెకు మూడు పక్కటెముకలు విరిగి పోయాయి. ఈ కేసులో తుది తీర్పును కోర్టు తాజాగా వెలువరించింది. నిందితుడికి 10 వేల యువాన్లు (సుమారు రూ.1.16 లక్షలు) జరిమానా విధించింది.