దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిశాయి. బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు కళకళలాడాయి.సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 60,260కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944కి ఎగబాకింది.