అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోనిపూర్ జిల్లాలో స్థానికంగా నిర్వహించిన ఫుల్ బాల్ మ్యాచ్‌పై తునిరామ్ మాద్రి, బెయిలా హేమ్రామ్ అనే ఇద్దరు స్నేహితులు రూ.500లు బెట్టింగ్ వేసుకున్నారు. హేమ్రామ్ పందెం గెలవడంతో మాద్రిని డబ్బు ఇవ్వమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న మాద్రి తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో రామ్ తల నరికేశాడు. అనంతరం ఆ తల పట్టుకుని 25 కి.మీ దూరం వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.