హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఒక్క అవకాశం చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం తెలియని వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్లోకి తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనని వెల్లడించారు. బాలకృష్ణ రెండు రోజుల పర్యటన నిమిత్తం హిందూపురం నియోజకవర్గానికి వచ్చారు. తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని బాలకృష్ణ ప్రారంభించారు.