జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ సోమవారం యూపీలోని ముజఫర్నగర్లో తిరంగా మార్చ్ చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైగా, గాడ్సే విప్లవకారుడు అంటూ హిందూ మహాసభ నేతలు వర్ణించారు. దీంతో ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది.