ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 2020 అక్టోబర్‌లో వచ్చామని.. ప్రభుత్వం 2020 డిసెంబర్లో జీవో ఇచ్చిందని.. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి, 2022 ఆగస్ట్‌లో తొలి దశ పూర్తి చేసినట్లు యోకహోమా సంస్థ ప్రతినిధులు చెప్పారు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేసారు.
అలానే 30 నెలలు పట్టాల్సిన ఈ పనులను పునాది వేసిన 15 నెలల్లోనే పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించామని యోకహోమా సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదంతా ఏపీ ప్రభుత్వం సహకారం, పెట్టుబడులకు ఉన్న మంచి వాతావరణం వల్లే సాధ్యమైందని చెప్పారు.