మూడేళ్లలో రూ.39,350 కోట్లతో 98 మెగా పరిశ్రమలు, 60,541మందికి ఉద్యోగాలు మరియు 31,671 ఎంఎస్‌ఎంఈలు ద్వారా 1,98,521 మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నం.1 .
15 నెలల వ్యవధిలోనే యెకహోమా ఉత్పత్తి ఆరంభం.. అచ్యుతాపురం సెజ్‌లో ఏటీసీ టైర్ల ఉత్పత్తి ప్రారంభంతో పాటు రెండో యూనిట్‌కు శంకుస్థాపన. అలాగే మరో 8 పరిశ్రమలకూ శంకుస్థాపన చేసిన సీఎం.
మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న రాష్ట్రం ఏపీ మాత్రమే.. గతంలో మన రాష్ట్రం వైపు చూడని వారు కూడా ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. 2021–22లో దేశ ఎగుమతుల్లో 4.58% ఉన్న రాష్ట్ర ఎగుమతుల వాటా 10 శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నట్లు తెలియజేసారు.