కాకినాడ జిల్లా నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మరియు పాత DPO ప్రాంగణంలో ఉన్న ఆర్మడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ భవనాలను తనిఖీ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస హౌసింగ్ కార్పొరేషన్ MD Addl.DGP శ్రీ N.సంజయ్, IPS.
పోలీసు భవనాల నిర్వహణ, వాటి స్థితి గతులు తదితర అంశాలపై తనిఖీ నిర్వహించడానికి జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీస హౌసింగ్ కార్పొరేషన్ MD Addl.DGP శ్రీ N.సంజయ్, IPS., గారు ఈరోజు ఉదయం 6 గంటలకు పాత జిల్లా పోలీస్ కార్యాల ప్రాంగణంలో ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్ లో ఉన్న వివిధ భవనాలు, అదేవిధంగా నూతన జిల్లా పోలీస్ కార్యాలయ భవనాన్ని సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాల గదులను, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా సందర్శించి వాటి నిర్వహణ తీరును పరిశీలించి ప్రశంసించారు.
ఈ తనిఖీలలో Addl.DG లాంటి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి అయిన సంజయ్ గారు ఒక సాధారణ వ్యక్తి వలె ద్విచక్ర వాహనంపై స్థానిక అధికారులతో కలిసి ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా తనిఖీలలో పాల్గొన్నారు.ఈ తనిఖీలలో Addl SPs శ్రీ పి.శ్రీనివాస్, శ్రీ బి.సత్యనారాయణ, SB DSPలు పాల్గొన్నారు.