సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నకిలీ వార్తలు వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశ వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 8 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. దేశ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతి భద్రతలకు వ్యతిరేక సమాచారాన్ని ఇవి వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa