తెలుగుదేశం పార్టీ సిగ్గు, ఎగ్గు లేకుండా ఫేక్ వీడియోలు, ఫేక్ సర్టిఫికెట్లతో రాజకీయం చేస్తోందని, ఆ పార్టీ, ఆ పార్టీని నడిపే నాయకుడు ఫేక్ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు.
ఫేక్ వీడియోలతో రాజకీయాలు చేస్తామంటే అవి చెల్లవని టీడీపీని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలన చూసి కడుపుమంటతో టీడీపీ దుష్టరాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత గురువారం మీడియాతో మాట్లాడారు.