గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గుపెట్టడం లేదు. సిగ్గు శరం ఏమాత్రం లేకుండా రాజకీయాల కోసం దిగజారిపోతున్నారు.
అసలు పోతిన ప్రసాద్ ఎవరు? ఆయనకు ఈ వ్యవహారానికి ఏం సంబంధం అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబే విదేశాల్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు లెటర్ రాయవచ్చు కదా అన్నారు. పోతిన ప్రసాద్ కి నేనిచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ కాదని ల్యాబ్ రాసిందన్నారు. ఒక అశ్లీల వీడియో సృష్టించడం ఎందుకు? ఆ వీడియోని ప్రచారం చేయడం ఏంటి? నేనే తయారుచేశానని చంద్రబాబే ప్రకటించవచ్చు కదా అన్నారు.