ఛత్తీస్గఢ్లో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసాడు. జూలై 11న బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పినా భయంతో ఎవరికీ చెప్పలేదు. తాజాగా బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.