2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన 36 గంటల పర్యటనకుగాను ఏర్పాట్లకు కేంద్రానికి దాదాపు రూ.38లక్షలు ఖర్చయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. కేంద్ర సమాచార కమిషన్కు తెలిపింది. ట్రంప్ పర్యటన కోసం కేంద్రం పెట్టిన ఖర్చెంతో తెలపాలంటూ మిషల్ భతేనా 2020 అక్టోబరులో సహచట్టం ద్వారా విదేశాంగ శాఖకు దరఖాస్తు చేయగా.. ఈ నెల 4న సమాధానమిచ్చింది.