కరెంట్ కొనుగోలు బకాయిలు చెల్లించడం లేదని ఏపీ, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం నోటిసులు జారీ చేసింది. బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనకుండా నిషేధం విధించింది. ఆయా రాష్ట్రాలు 17,060 కోట్లు బకాయిలున్నాయి. రాష్ట్రాలు సొంతంగా విద్యుదుత్పత్తి చేసుకుంటున్నా అది వర్షాకాలం వరకే పరిమితం. తర్వాత కేంద్రం ఇచ్చే విద్యుత్ కొనకుండా ఉండలేని పరిస్థితి. బకాయిలు కట్టకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఏర్పడే అవకాశం ఉంది.